విజయ్ కి గవర్నర్ షాక్.. ఇప్పట్లో ప్రభుత్వ ఏర్పాటు లేనట్లేనా?
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విజయ్ బుధవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తో విజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా వున్నామని ప్రకటించారు. అంతేకాకుండా ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ గవర్నర్ కి అందించారు. అయితే.. 118 మంది ఎమ్మెల్యేల మద్దతును విజయ్ ఇంకా నిరూపించుకోలేకపోయారని, దీనిపై గవర్నర్ కాస్త అసంతృప్తిగా వున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ ను విజయ్ కోరారని, బలపరీక్షలో మెజారిటీ సాధిస్తామన్న విజయ్ వాదనతో గవర్నర్ అర్లేకర్ సంతృప్తిగా లేరని లోక్ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు మళ్లీ సందిగ్ధంలో పడిపోయింది.
ప్రస్తుతం తన వద్ద వున్న 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ గవర్నర్ కి అందజేశారు. మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేలు వుండాలి. కానీ విజయ్ దగ్గర ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేలే వున్నారు. అయితే.. తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మిగతా చిన్న పార్టీలు మద్దతివ్వాలి, మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు విజయ్ కి అవసరం వుంది. మొత్తం 118 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కి అందజేసిన తర్వాతే, ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమం అవుతుందని తెలుస్తోంది. అప్పుడు మాత్రమే గవర్నర్ ముందుకు కదులుతారని అంటున్నారు.
ఇవి కూడా చదవండి








