ఓవైపు పోలింగ్.. మరో వైపు సుబేందు వర్సెస్ మమత
బెంగాల్ లో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. 142 స్థానాల్లో ఈ పోలింగ్ కొనసాగుతోంది. మరో వైపు బెంగాల్ కి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య ‘‘డైలాగ్ వార్’’ కూడా కొనసాగుతోంది. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బెంగాల్ రెండో దశ అంతా కూడా భవానీపూర్ కేంద్రంగానే కొనసాగుతోంది. ఎందుకంటే బీజేపీ నుంచి సుబేందు అధికారి బరిలో వుండగా, తృణమూల్ నుంచి సీఎం మమతా బెనర్జీయే రంగంలోకి దిగారు.పోలింగ్ ప్రక్రియ జరుగుతుండగా సువేందు అధికారికి, TMC కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
తాజాగా పోలింగ్ జరుగుతున్న సమయంలో సుబేందు అధికారి టీఎంసీకి బలమైన పట్టున్న ఓ పోలింగ్ కేంద్రానికి సుబేందు అధికారి చేరుకున్నారు. ఈ సమయంలోనే తృణమూల్ కార్యకర్తలు కూడా అక్కడే వున్నారు. దీంతో సుబేందు ‘‘జై శ్రీరామ్’’ అంటూ నినాదాలిచ్చారు. దీనికి బదులుగా టీఎంసీ కార్యకర్తలు ‘‘జై బంగ్లా’’ అంటూ నినాదాలిచ్చారు.ఫలితంగా అక్కడ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది, సువేందు అధికారికి మరియు టీఎంసీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చెలరేగింది.
ఇవి కూడా చదవండి
అయితే.. టీఎంసీ కార్యకర్తలపై సుబేందు అధికారి కేంద్ర బలగాల బాధ్యులకు ఫిర్యాదు చేశారు. వారంతా ఓటర్లు కాదని, బంగ్లాదేశీ ముస్లింలని ఆరోపించారు. “వారందరూ బంగ్లాదేశీ ముస్లింలే… వారు భయపడుతున్నారు. మమత తుడిచిపెట్టుకుపోతారు.” అంటూ మండిపడ్డారు. సీఎం మమతా గూండాలను వెంటేసుకొని తిరుగుతూ, ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో, బీజేపీ “జై శ్రీరామ్” నినాదాన్ని ఎత్తుకోగా, TMC దానికి దీటుగా “జై బంగ్లా” నినాదంతో బదులిచ్చింది. సరిగ్గా ఇదే కారణం చేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి “జై శ్రీరామ్” అని నినదించినప్పుడు, TMC కార్యకర్తలు “జై బంగ్లా” నినాదాలతో ప్రతిస్పందించారు.
క్షణాల్లోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది; ఇది త్వరలోనే తీవ్రమైన ఘర్షణగా మారి, ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భద్రతా దళాలు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.
రిగ్గింగ్ జరుగుతోంది : మమతా బెనర్జీ
మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు.కేంద్ర బలగాలు తమ పార్టీ కార్యకర్తల ఇళ్ల్లోకి చొరబడి, ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్ కి పాల్పడుతోందని, ఎన్నికల సంఘం పరిశీలకులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కార్యకర్తను కొట్టారని, ఇదేం గూండాయిజం అని ప్రశ్నించారు. ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ అని, కానీ వారు పండగ స్ఫూర్తినే దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి








