ఇప్పుడు అందరి చూపూ ఆయనవైపే!.. తమిళనాడు ఫలితాలపై హీరో విశాల్ ట్వీట్
తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ క్షణక్షణానికీ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. దళపతి విజయ్ (Vijay) స్థాపించిన ‘టీవీకే’ (TVK) పార్టీ సృష్టిస్తున్న ప్రభంజనంతో ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకు బీటలు వారుతోంది. ఎవరికి పూర్తి మెజారిటీ వస్తుందో, ఎవరి ఆధిక్యం ఎంతవరకు నిలుస్తుందోననే టెన్షన్ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. సరిగ్గా ఈ హై-డ్రామా పరిస్థితుల మధ్య.. ప్రముఖ యాక్షన్ హీరో, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ (Vishal) ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చేసిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
విశాల్ తన ట్వీట్లో ఏమన్నారంటే..
ఎన్నికల ఫలితాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తున్న విశాల్ (Vishal).. ఇప్పుడు అందరి దృష్టీ రాష్ట్ర రాజ్యాంగ అధినేత అయిన ‘గవర్నర్’ (Governor) పైనే ఉండబోతోందన్నారు. “వెల్ వెల్ వెల్.. ఇది డీ-డే (D-Day). ప్రజా తీర్పు వెలువడుతోంది. ఈ ఫలితాల్లో భారీ ట్విస్టులు, టర్న్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు మన తమిళనాడు ‘గవర్నర్’ పేరు ఎంతమందికి తెలుసో చూద్దాం. మరో కొద్ది గంటలు ఆగితే.. రాబోయే రోజుల్లో ఆయన పూర్తి యాక్షన్‌లో (Full action) ఉండటం మనం చూడబోతున్నాం. ఆయన పేరు శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. తుది ఫలితాల కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ విశాల్ (Vishal) తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
విశాల్ ట్వీట్ వెనుక ఉన్న అసలు అర్థం ఇదే!
రాజకీయ పరిణామాలపై స్పష్టమైన అవగాహన ఉన్న విశాల్ (Vishal) ఈ ట్వీట్ చేయడం వెనుక బలమైన ఉద్దేశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ట్రెండ్స్ ప్రకారం రాష్ట్రంలో ‘హంగ్ అసెంబ్లీ’ (Hung Assembly) ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ (118) దక్కకపోతే.. అప్పుడు ఎవరిని ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలనే విచక్షణాధికారం పూర్తిగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ దే అవుతుంది.
దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యే సునాయాసంగా జరిగిన అధికార బదిలీ.. ఇప్పుడు విజయ్ ‘టీవీకే’ రాకతో సంక్లిష్టంగా మారింది. సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో రాజ్‌భవన్ (Raj Bhavan) కేంద్రంగా రాబోయే రోజుల్లో భారీ రాజకీయ ఎత్తుగడలు జరగబోతున్నాయని విశాల్ (Vishal) ముందుగానే పసిగట్టారు. అందుకే ఆయన ఏ పార్టీని నేరుగా ప్రస్తావించకుండా, వ్యూహాత్మకంగా “గవర్నర్ ఫుల్ యాక్షన్‌లో ఉంటారు” అంటూ కామెంట్ చేశారు.
గతంలో రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించి, నామినేషన్ తిరస్కరణకు గురైన అనుభవం ఉన్న విశాల్ (Vishal).. ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయాలను నిశితంగా గమనిస్తుంటారనడానికి ఈ ట్వీట్ ఉదాహరణ. తుది ఫలితాలు వెలువడే కొద్దీ, విశాల్ అంచనా వేసినట్లుగానే తమిళనాట రాజకీయ డ్రామా గవర్నర్ కార్యాలయం చుట్టే తిరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








