‘I-PAC’ తో అఖిలేష్ కటీఫ్.. ముందే ఊహించి, జాగ్రత్తపడ్డ అఖిలేష్
బెంగాల్ లో మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత’I-PAC’భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ‘I-PAC‘క్షేత్ర స్థాయిలో కష్టపడ్డా… ఫలితాలు మాత్రం పూర్తిగా తారుమారయ్యాయి. దీంతో యూపీలో దాని భవితవ్యం ఏమిటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. బెంగాల్ లో మమత ఘోర పరాజయం తర్వాత సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ‘I-PAC’ విషయంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘I-PAC’తో సంబంధాలను తెంచుకుంటున్నట్లు కీలక ప్రకటన చేశారు.
ఓ విలేకరుల సమావేశంలో అఖిలేష్ ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘‘అవును
ఇవి కూడా చదవండి
నిజానికి బెంగాల్ లో మమతా బెనర్జీ భారం మొత్తాన్ని ‘I-PAC’ తన భుజాలపై మోసింది. ఉత్తరప్రదేశ్లో జరగబోయే 2027 ఎన్నికల కోసం, తన ఎన్నికల వ్యూహాన్ని రూపొందించే బాధ్యతను అఖిలేష్ I-PACకి అప్పగించారు. 2025లో ఢిల్లీలో అఖిలేష్ I-PACతో తన మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ యేడాది జనవరిలో మళ్లీ సమావేశమయ్యారు. అయితే.. ఉత్తరప్రదేశ్లో జరగబోయే 2027 ఎన్నికల కోసం, తన ఎన్నికల వ్యూహాన్ని రూపొందించే బాధ్యతను అఖిలేష్ I-PACకి అప్పగించారు. 2025లో ఢిల్లీలో అఖిలేష్ I-PACతో తన మొదటి సమావేశాన్ని నిర్వహించారు.
అయితే.. ఈ యేడాది జనవరిలో బెంగాల్ లో పర్యటించినప్పుడు అఖిలేష్ మళ్లీ ‘I-PAC’ తో సమావేశమయ్యారు. ఏకంగా ఓ అగ్రిమెంట్ కూడా జరిగిందని అంటారు. కానీ.. చివరికి అఖిలేష్ ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించేశారు. అయితే.. దీనికి కేవలం డబ్బుల కారణం ఒక్కటే కాదన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
దీనికి కారణం బెంగాల్ లో మమతా బెనర్జీ చిత్తు చిత్తుగా ఓడిపోవడమేనని అంటున్నారు. అలాగే తమిళనాడులో కూడా స్టాలిన్ కి పరాభవమే జరిగింది. ఎన్నికల వ్యూహం రచించడంలో ఐ పాక్ ఘోరంగా విఫలమైందని అఖిలేష్ ఓ నిర్ధారణకు వచ్చారని అంటున్నారు. ఇంత ఘోరమైన వైఫల్యాన్ని ఐ పాక్ మూటగట్టుకుందని, అలాంటి కన్సల్టెన్సీకి బాధ్యత అప్పగించడం కంటే, తమ సొంత సంస్థాగత కేడర్ పైనే ఆధారపడి ముందుకు సాగితే మంచిదని అఖిలేష్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ ఏడాది ఆరంభంలో, ఆరోపిత బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐ-ప్యాక్ కోల్కతా కార్యాలయంలో మరియు సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు నిర్వహించినప్పటి నుండి, ఆ సంస్థపై జరుగుతున్న పరిశీలనల నేపథ్యంలో ఈ పునరాలోచన చోటుచేసుకుంది.ED అధికారులు I-PAC కోల్కతా కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న సరిగ్గా అదే రోజున, ఆ కన్సల్టెన్సీ ప్రతినిధులు లక్నోలో ఉండి, 2027 ఎన్నికల కోసం సాధ్యమయ్యే సహకారం గురించి సమాజ్వాదీ పార్టీ నాయకులకు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
వీటన్నింటి నేపథ్యంలో అఖిలేష్ పునరాలోచనలో పడింది. బెంగాల్, తమిళనాడు ఘోర వైఫల్యాలు, ఈడీ దాడుల నేపథ్యంలో అఖిలేష్ జంకినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐ పాక్ తో కటీఫ్ అని ప్రకటించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి








