నాగార్జున జుట్టు 66 ఏళ్ల వయసులోనూ అంత ఒత్తుగా ఎలా ఉంది? ఆయన చెబుతున్న చిట్కాలు ఇవే!
Hair Care: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం దీనికి ప్రధాన కారణాలు. అయితే, టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున 66 ఏళ్ల వయసులో కూడా తన స్టైలిష్ లుక్తో, ఒత్తైన నల్లని జుట్టుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన తన కేశ సంరక్షణ కోసం పాటిస్తున్న సహజ చిట్కాలు ఇవే.
సహజ ఆహారమే రహస్యం..
నాగార్జున ఎటువంటి ఖరీదైన రసాయన ఉత్పత్తులను వాడరు. జుట్టు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే కరివేపాకు, ఉసిరి, గుడ్లు వంటి పోషకాహారాలను ఆయన క్రమం తప్పకుండా తీసుకుంటారని పేర్కొన్నారు. ఇవి ఐరన్ , బయోటిన్ అందించి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.
జీవనశైలి మార్పులు..
ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి జుట్టు రాలుతుంది. దీనిని తగ్గించడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా తలలో రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు రాలడం తగ్గుతుందని ఆయన చెబుతున్నారు. సరైన నిద్ర , మానసిక ప్రశాంతత జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.
సహజ పద్ధతులను అనుసరించడం..
రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూలకు బదులుగా సహజ పద్ధతులను అనుసరించడం మేలు. వారానికి కనీసం రెండుసార్లు గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల కుదుళ్లు బలపడతాయి. జుట్టు రాలడం అనేది రాత్రికి రాత్రే తగ్గేది కాదు. నాగార్జున లాంటి సెలబ్రిటీలు పాటించే ఈ సహజ నియమాలను క్రమశిక్షణతో కూడిన జీవనశైలిలో భాగంగా చేసుకుంటే, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు.








