యూఎస్ వీసాలపై ఐటీ ఎత్తుగడలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో భారత ఐటి దిగ్గజాలు తమ ఎత్తుగడలను మార్చుతున్నాయి. అమెరికాలో కొత్త పాలసీలు అమలయ్యే లోపలే తమ యూఎస్ వర్క్ వీసాల్లో మార్పులు తీసుకురావాలని దేశీయ ఐటి, అవుట్సోర్సింగ్ కంపెనీలు నిర్ణయించాయి. తక్కువ అనుభవమున్న ఉద్యోగులకు హెచ్-1బి వీసాలు దరఖాస్తు చేయకూడదని నిర్ణయించామని మైండ్‌ట్రీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్రిష్ట కుమార్ తెలిపారు. మిగతా కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తునాయన్నారు. ఇప్పటికే ఇన్ఫోసిస్ నాలుగేళ్ల కంటే తక్కువ అనుభమున్న ఉద్యోగులకు వీసాలు దరఖాస్తు చేయకూడదని నిర్ణయించిందని సమాచారం.













