న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద.. ప్రవాస భారతీయులు వేడుకలు
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేళ న్యూయార్క్‌లో వేళ న్యూయార్క్‌లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామ జపంతో మార్మోగింది. ప్రవాస భారతీయులు మన సంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. కూడలిలోని విద్యుత్ బిల్డోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇక్కడ లైవ్‌లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రవాస భారతీయులు టైమ్స్ స్క్వేర్ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి, శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతబూని వేడుకలు చేసుకున్నారు. మసాచుసెట్స్‌లోని వొర్సెస్టర్ నగర మేయర్ జో పెట్టీ హిందూ సమాజానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.







