అమెరికా ఎన్నికల బరిలో భారత సంతతి అభ్యర్థులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందినవారి ప్రాతినిధ్యం ఈ సారి పెరిగే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు, భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్కు ఈ సారి ఎక్కువ మందే మనవాళ్లు పోటీ పడుతున్నారని అన్నారు. వీరిని సమోసా కారకస్ అని ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదుగురు చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, నలుగురు ప్రతినిధులు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. బిడెన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల హారిస్ ఇప్పటికే బరిలో ఉన్నారు. అమెరికా కాంగ్రెస్కు అటు డెమొక్రాటిక్, ఇటు రిపబ్లికన్ పార్టీల నుంచి వీరు పోటీ చేస్తున్నారు. డా.అమీ బెరా, ఆర్వో ఖన్నా, కృష్ణమూర్తితో పాటు, తొలి భారత సంతతి చెందిన ఏకైక మహిళా ప్రమీలా జయపాల్ మరో పర్యాయం చట్ట సభ్యకు ఎన్నికయ్యే అవకాశాలున్నట్లు కృష్ణమూర్తి తెలిపారు. వీరికి డా.హీరా త్రిపుర్నేని తోడయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
ఆరిజోనాలోని ఆరవ కాంగ్రెషనల్ జిల్లా నియోజకవర్గ రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్ ష్వీకెర్ట్ కంటే హీరానే ముందంజలో ఉన్నారు. మనేలోని సెనేటర్ అభ్యర్థి కోసం గట్టి పోటీనిస్తునే రిపబ్లికన్ నేత, సెనేటర్ సుశాన్ కొల్లిన్పై భారత సంతతికి చెందిన సారా గిడన్ గెలుపొందే అవకాశాలున్నాయని డెమొక్రటిక్ పార్టీ భావిస్తున్నది. అదే విధంగా డా.బోం అయిదోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఎక్కువ కాలం చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక భారత సంతతికి చెందిన నేత బోరానే కావడం విశేషం.













