టాంజానియా టీఆర్ఎస్ ఎన్నారైశాఖ కమిటీ నియామకం
తెలంగాణ రాష్ట్ర సమితి టాంజానియా ఎన్నారైశాఖకు కమిటీని ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ప్రకటించారు. అధ్యక్షుడిగా నరసింహారెడ్డి వంగ, ఉపాధ్యక్షుడిగా కిశోర్ బొల్లకపల్లి, ప్రధాన కార్యదర్శిగా కుశాల్‌రెడ్డి, అదనపు ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్‌రెడ్డి, కోశాధికారికిగా శ్రీనివాస్ సిరిపురం, కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాస్‌రెడ్డి రావుల, ప్రవీణ్ చంద్ర మాకలా, సంతోష్‌రెడ్డి కోత, సైదులు కొల్లోజి, మహేశ్‌రెడ్డి, ఐటీ కార్యదర్శిగా శ్రవణ్‌కుమార్, మీడియా ఇంచార్జిగా నాగరాజు జల్లా, చారిటీ ఇంచార్జిగా దయాకర్‌చారి, ఈవెంట్ ఇంచార్జిగా అనిల్‌రెడ్డితో పాటు కల్చరల్ మెంబర్షిప్ ఇంచార్జి, సోషల్ మీడియా ఇంచార్జిలను కూడా నియమించారు.













