దుబాయ్ లో వలస కార్మికులకు నిత్యావసరాలు
టీఆర్ఎస్ ఎన్నారై విభాగం గల్ఫ్‌లోని వలస కార్మికులకు అండగా నిలిచింది. టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల సొంత నిధులతో వందమంది కార్మికులకు నెలకు సరిపడా బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, కారం, పసుపు, పచ్చళ్లు సమకూర్చారు. వాటిని దుబాయ్ టీఆర్ఎస్ సభ్యుడు నరేశ్, గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి సభ్యులు గుండెల్లి నరసింహ, శేఖర్‌గౌడ్ వలస కార్మికులకు పంపిణీ చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు హైదరాబాద్‌లోని లహరి వృద్ధ, అనాథ శరణాలయం, మీర్జాలగూడ సెయింట్ అంథోని రాబర్ట్ వృద్ధాశ్రమం, అల్వాల్ వేద పాఠశాలతో పాటు జవహర్‌నగర్, గచ్చిబౌలిలోని భవన నిర్మాణ కూలీలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఐడీఏ బొల్లారంలోని జైర్ సొసైటీ ఫర్ కేర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్స్‌కు అవసరమైన మందులు ఇచ్చారు.













