ఘనంగా టిఎల్సిఎ సంక్రాంతి వేడుకలు
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్సిఎ) ఆధ్వర్యంలో న్యూయార్క్, న్యూజెర్సి, కనెక్టికట్లలో ఉన్న తెలుగువారు సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలను అధ్యక్షుడు కఠారు నెహ్రు, వారి టీమ్ ఆధ్వర్యంలో వైభవంగా జరుపకున్నారు. జనవరి 21వ తేదీన ఫ్లషింగ్లోని హిందూ టెంపుల్లో జరిగిన ఈ వేడుకలకు ఎంతోమంది హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, సినిమా పాటల విభావరి, ఫ్యాషన్ షో వంటి ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని పిల్లలతో కూడా దేశభక్తిని ప్రదర్శించే కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు గాలిపటాల పోటీలను నిర్వహించారు.
అలాగే చిన్నారులకు సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చేలా బోగిపళ్ళు పోశారు. టిఎల్సిఎ కల్చరల్ చైర్ సుమంత్ రామ్సెట్టి ఆధ్వర్యంలో కో చైర్ కిరణ్ పర్వతాల, దివ్య దొమ్మరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సంప్రదాయాన్ని మురిపిస్తూ, సాంస్కృతిక వైభవాన్ని తెలియజేస్తూ, దేశభక్తిని చాటుతూ నిర్వహించిన ఈ వేడుకలు ఎంతోమందిని అలరించాయి. ఈ వేడుకల్లో హీరోయిన్ అషురెడ్డి, గాయని మూడుమూడి శృతిరంజని, గాయకుడు అరుణ్ కౌండిన్య ముసునూరి, కొరియోగ్రాఫర్ సత్యమాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మద్దిపట్ల ఫౌండేషన్ వారు ర్యాపుల్ బహుమతులను అందించారు.
అధ్యక్షుడు నెహ్రూ కఠారు మాట్లాడుతూ, సంక్రాంతి సంప్రదాయ వైభవాన్ని తెలియజేసేలా టిఎల్సిఎ వేడుకలను ఏర్పాటు చేశామని, అతిధులు, కళాకారులు, ఇతర ప్రముఖులకు, దాతల సహకారంతో జరిగే ఈ వేడులకు చూసేందుకు వచ్చిన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. టిఎల్సిఎ చేస్తున్న కార్యక్రమాలను కూడా వివరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు ప్రముఖులు టిఎల్సిఎ చేస్తున్న సేవా కార్యక్రమాలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నెహ్రూ కఠారుతోపాటు, వైస్ ప్రెసిడెంట్ కిరణ్ రెడ్డి పర్వతాల, సెక్రటరీ సుమంత్ రామ్ సెట్టి, ట్రెజరర్ మాధవి కోరుకొండ, జాయింట్ సెక్రటరి శ్రీనివాస్ సనిగెపల్లి, జాయింట్ ట్రెజరర్ అరుంధతి అడప పాస్ట్ ప్రెసిడెంట్ జయప్రకాశ్ ఇంజపూరి తదితరులతోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, బోర్డ్ చైర్మన్ డా. ప్రసాద్ అంకినీడుతోపాటు బోర్డ్ సభ్యులు పలువురు పాల్గొన్నారు.













