హెచ్-1బీపై ఆంక్షలు …. ఐటీ సంస్థలకు లాభమే
హెచ్-1బీ వీసాలపై అమెరికా విధిస్తున్న ఆంక్షలు దేశీయ ఐటీ పరిశ్రమకు అనుకూలంగా పరిగణనమించనున్నాయని ఇన్ఫోసిస్ మాజీ అధికారి మోహన్ దాస్ పాయ్ అన్నారు. ప్రస్తుతం భారత ఐటీ కంపెనీలు ఆఫ్షైర్ ఆన్లైన్ ఉద్యోగ నిష్పత్తి 70:30 శాతంగా ఉందని, ఈ నూతన వీసా నిబంధనలతో ఆ నిష్పత్తి 90:10 శాతానికి పెరుగనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల భారత ఐటీ సంస్థలు ఆఫ్‌షోర్ విభాగంలో మరింతగా బలోపేతం అవడానికి దోహదపడనున్నదని తెలిపారు. మొత్తం 90 శాతం కార్యకలాపాలు ఆఫ్‌షోర్‌లో నిర్వహించడం ద్వారా పోటీ తత్వంతో పాటు వారి నైపుణ్యం పెరిగే అవకాశముందన్నారు. హెచ్-1బీ వీసాలపై కఠిన నిబంధనలు అమలు చేయడం దేశీయ ఐటీ కంపెనీలకు లాభాలు తీసుకురానున్నదన్నారు.
అమెరికాలో సగటున ఐటీ ఉద్యోగికి ఏడాదికి 80 వేల డాలర్ల నుంచి 85 వేల డాలర్ల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. కొన్ని కంపెనీలు నైపుణ్యం లేనివారిని నియమించుకోవడం భారత్‌కు చెడ్డపేరు తీసుకువస్తున్నదని అన్నారు. అమెరికాలో నైపుణ్యం లేమితో సతమతమవుతున్నదని, ఫలితంగా ఆయా కంపెనీలు భారత్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉంటుందన్నారు.













