ఘనంగా తానా పాఠశాల తొలి వార్షికోత్సవం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో అమెరికాలోని తెలుగు చిన్నారులకు తెలుగు భాషను నేర్పించే ‘పాఠశాల’ మొదటి వార్షికోత్సవం ఇటీవల అంతర్జాలంలో ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు, తానా కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ తెలుగు భాషపై అభిమానంతో స్వచ్ఛందంగా పాఠశాలలో తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ 2లక్షల డాలర్ల విరాళానికి ఆయన కుటుంబీకులకు ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల మాట్లాడుతూ ప్రవాస బాలలకు తెలుగు నేర్పించాలనే దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నామని, దీనికోసం తానా కార్యవర్గం, పాఠశాల టీమ్ సమిష్టిగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రసాద్ మంగిన పాఠశాలకు ‘‘బాటా’’ సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా ఏర్పాటు చేసిన పాఠశాల సమ్మర్ క్యాంపుకు పెద్దసంఖ్యలో ప్రవాస చిన్నారులు హాజరయ్యారు. ఈ క్యాంపును వెంకట్ కొర్రపాటి గణేశ ప్రార్ధనతో ప్రారంభించారు. రవి పోచిరాజు నీతి కథలు బోధించారు. సత్య బుర్ర పాఠశాల పాఠ్యాంశాలపై వివరించారు. చిన్నారులకు క్విజ్ నిర్వహించారు. రజని మారం శ్లోకాన్ని ఆలపించారు. చివరగా తల్లిదండ్రులు పాఠశాల రిజిస్ట్రేషన్ లో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
తానా కార్యవర్గ సభ్యులు సతీష్ వేమూరి, మురళి తాళ్లూరి, రాజా కసుకుర్తి, ఉమ కటికి, లోకేష్ నాయుడు, హితీష్ వడ్లమూడి, పురుషోత్తం, శ్రీకాంత్ పోలవరపు, శ్రీనివాస్, సతీష్ కొమ్మన, సునీల్ కోగంటి, హనుమంతరావు, ప్రదీప్ గడ్డం, వంశీ వాసిరెడ్డి, దిలీప్ ముసునూరు, శ్రీనివాస్ గోగినేని, సాయి బొల్లినేని, రామ్ తోట, రవిచంద్ర, రత్నప్రసాద్ గుమ్మడి మొదలైన వారు హాజరై పాఠశాల రిజిస్ట్రేషన్స్కు సహకరిస్తామని తెలియజేశారు.
పాఠశాల బృందం సభ్యులు కృష్ణ నందమూరి, ఫణి కంతేటి, సాయి జరుగుల, విక్రాంత్, శివనాగరాజు, అనిల్ పోటు, భాను మావులూరి, శ్రీనివాస్ కూకట్ల, వెంకట సింగు, లక్ష్మి అద్దంకి, శ్రీధర్, కృష్ణమోహన్, సునీల్ దేవరపల్లి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.













