తానా-పాఠశాల అడ్మిషన్లు ప్రారంభం
విదేశాల్లో ఉన్న తెలుగు పిల్లలకు కూడా తెలుగు భాష తియ్యదనం తెలియాలనే ఉద్దేశ్యంతో ‘తానా-పాఠశాల’ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవంతంగా సాగుతున్న పాఠశాల 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ‘పాఠశాల’ ఫీజును కూడా 110 డాలర్లకు తగ్గించడం గమనార్హం. ‘మన తెలుగు.. మన పిల్లల కోసం’ అనే నినాదంతో ముందుకెళ్తున్న తానా-పాఠశాల.. చికాగో, డల్లాస్, లాస్ ఏంజెలిస్ సహా పలు కీలక పట్టణాల్లోని పాఠశాలల్లో అడ్మిషన్లు స్వీకరిస్తోంది. మరిన్ని వివరాల కోసం www.paatasala.tana.org ను చూడవచ్చు.













