ఇర్వింగ్ లో తానా ప్రచార సభ జయప్రదం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సెయింట్లూయిస్లో మే 28 నుంచి నిర్వహిస్తున్న 21వ మహాసభలను పురస్కరించుకుని వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఇర్వింగ్లో ఉన్న అమరావతి సమావేశ మందిరంలో నిర్వహించిన తానా మహాసభల ప్రచార కార్యక్రమం విజయవంతమైంది. తానా అభిమానులు, తెలుగు ప్రముఖులు ఎందరో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుగన్ చాగర్లమూడి తొలుత అందరికీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జంపాల చౌదరి మాట్లాడుతూ, తానా కమ్యూనిటీకోసం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతోమందిని ఆకర్షించిందని చెప్పారు. తానా టీమ్ స్క్వేర్ ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమందికి సాయం అందిస్తున్నామని చెప్పారు.
సెయింట్లూయిస్లో జరిగే తానా మహాసభల సమన్వయకర్త చదలవాడ కూర్మనాథరావు మాట్లాడుతూ, 501 సి స్థాయి కలిగిన సేవా రంగ సంస్థలకు అమెరికా ఆదాయపన్నుశాఖ నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా సెయింట్ లూయిస్ సభల నిర్వహణ ఖర్చులు ఉంటాయని దానికితోడు ఈసారి సాంకేతిక లాకర్ సదుపాయంతో ప్రతి పైసా రాబడి-ఖర్చులను పారదర్శకంగా పాటిస్తున్నట్లు చెప్పారు. డాలస్, హ్యూస్టన్లోని తెలుగువాళ్ళు 21వ తానా మహాసభలకు 203,000 డాలర్లు విరాళంగా ఇచ్చారు.
మహాసభల నిర్వహణకు విరాళమిచ్చిన వారందరికీ జంపాల చౌదరి, చదలవాడ కూర్మనాథ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ పోలవరపు, డా. రాఘవేంద్ర ప్రసాద్, డా. ప్రసాద్ తోటకూర, డా. అడుసుమిల్లి రాజేష్, తాళ్ళూరి పూర్ణచంద్రరావు, దేవినేని పరమేష్, కన్నెగంటి మంజులత, జంపాల అరుణ, డా. నల్లూరి ప్రసాద్, కొడాలి నాగశ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, కేసీ చేకూరి, విజయ్ బొర్రా, చంద్ర కన్నెగంటి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి చలపతి కొండ్రకుంట సమన్వయకర్తగా వ్యవహరించారు.













