పాఠశాల పిల్లలకు సహాయపడిన తానా-1000 డాలర్ల విరాళం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఫిలడెల్ఫియాలో ఉన్న స్థానిక స్కూల్ పిల్లల సహాయార్థం అప్పర్మెరియన్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఫుడ్ ప్యాంట్రీ అయిన ‘అప్పర్ మెరియన్ ఏరియా కమ్యూనిటీ కప్బోర్డ్’ కు తానా ఫిలడెల్ఫియా విభాగం 1000 డాలర్లను విరాళంగా ఇచ్చింది. కోవిడ్ 19 కారణంగా పాఠశాల పిల్లలకు ఆహార కొరత ఏర్పడకుండా ఉండేందుకు వీలుగా తమవంతుగా ఈ సహాయాన్ని అందించినట్లు తానా కార్యదర్శి రవి పొట్లూరి చెప్పారు. కోవిడ్ 19 కారణంగా చాలాచోట్ల పాఠశాలలను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు ఆహారం విషయంలో ఇబ్బందులు కలగకుండా తానా తనవంతుగా సహాయాన్ని అందించింది.






