కాన్సాస్లో ఘనంగా తెలుగు ఉగాది
కాన్సాస్లో ఉగాది వేడుకలను తెలుగువాళ్ళు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక తెలుగు సంఘం కాన్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో హేవిళంబి నామ సంవత్సర ఉత్సవాలను సాంప్రదాయంగా చేశారు. పురాణ శ్రవణం, ప్రార్థనా గీతాలతో ప్రారంభమైన వేడుకలు పాటలు, ఆటలు, నాటకాలు, కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలతో అలరించాయి. సంఘం అధ్యక్షురాలు దుర్గ తేళ్ళ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేశారు. మాజీ అధ్యక్షులు శ్రీకాంత్ రావికంటి, బోర్డ్ చైర్మన్ అజయ్ కాసరబాదను మెమెంటోలతో సత్కరించారు. ఇటీవల జరిగిన జాతి వివక్ష కాల్పుల నేపథ్యంలో ఈ సంవత్సర వేడుకలను ప్రత్యేక ఆహ్వానితులుగా స్టేట్ సెనేటర్ రాబర్ట్ ఓల్సన్, ఎఫ్ బి ఐ స్పెషల్ ఏజెంట్ హీద్ యాంకిలు హాజరై ఎన్నారైలతో తమ సఖ్యత కొనసాగుతుందని తెలిపారు.













