షార్లెట్ TAGCA హెల్త్ ఫెయిర్.. మే 17న రక్త పరీక్షలు!
TAGCA: అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న గ్రేటర్ షార్లెట్ ఏరియా తెలుగు సంఘం (TAGCA) తన కమ్యూనిటీ సంక్షేమం కోసం భారీ ‘హెల్త్ ఫెయిర్-2026’ను నిర్వహిస్తోంది. ప్రవాస భారతీయుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రెండు దశల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
మొదటి దశ: బ్లడ్ వర్క్ డే (Blood Work Day)
తేదీ: మే 17, 2026 (ఆదివారం)
సమయం: ఉదయం 10:00 నుండి 11:30 గంటల వరకు
ఇవి కూడా చదవండి
వివరాలు..
- ఈ రోజున తక్కువ ఖర్చుతో రక్త పరీక్షలు నిర్వహిస్తారు. దీనికోసం ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేదు (Walk-in).
- పరీక్షకు వచ్చే వారు కనీసం 8 గంటల పాటు ఆహారం తీసుకోకుండా (Fasting) ఉండాలి , తగినంత నీరు త్రాగాలి.
హెల్త్ ఫెయిర్ డే (Health Fair Day)..
- తేదీ: మే 31, 2026 (ఆదివారం)
- సమయం: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు
వివరాలు..
బ్లడ్ వర్క్ ఫలితాలను అందజేయడంతో పాటు, నిపుణులైన వైద్యులతో ఉచిత సంప్రదింపులు (Consultation) ఏర్పాటు చేయనున్నారు. డాక్టర్ల కన్సల్టేషన్ కోసం ముందస్తు అపాయింట్మెంట్ తప్పనిసరి. ఇందుకోసం www.tagca.org/healthfair వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి.
అందుబాటులో ఉండే వైద్య సేవలు..
ఈ హెల్త్ ఫెయిర్లో ఇంటర్నల్ మెడిసిన్, నెఫ్రాలజీ, ఆర్థోడాంటిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజీ, క్రిటికల్ కేర్, హెమటాలజీ , ఆంకాలజీ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు సేవలందిస్తారు. ఉచిత డెంటల్ కన్సల్టేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సేవల కోసం ఇన్సూరెన్స్ అవసరం లేదు.
వైద్యులు..
- డాక్టర్ సంగీత పోతు (ఇంటర్నల్ మెడిసిన్, నెఫ్రాలజీ)
- డాక్టర్ సురేష్ చల్లా (ఇంటర్నల్ మెడిసిన్)
- డాక్టర్ నిశ్చల్ నాథ (ఆర్థోడాంటిస్ట్)
- డాక్టర్ కిరణ్ జాగర్లమూడి (గ్యాస్ట్రోఎంటరాలజీ)
- డాక్టర్ పృథ్వి కుక్కడపు (నెఫ్రాలజీ, ఇంటర్నల్ మెడిసిన్, క్రిటికల్ కేర్)
- డాక్టర్ గీత వల్లభనేని (హెమటాలజీ, ఆంకాలజీ)
- డాక్టర్ శ్రీనివాస్ కోయ (ఇంటర్నల్ మెడిసిన్)
వేదిక..
పైన్విల్ డెంటల్ స్టూడియో (Pineville Dental Studio), 10635 Park Rd suite b, Charlotte, NC 28210.
సంప్రదించాల్సింది..
ఏవైనా సందేహాలుంటే సురేంద్ర యలవర్తి (+1 704-806-4131) ని సంప్రదించవచ్చునని TAGCA కార్యవర్గం తెలిపింది. షార్లెట్ పరిసర ప్రాంతాల్లోని తెలుగు వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఇవి కూడా చదవండి








