హ్యూస్టన్లో బాలు గానామృతం
హ్యూస్టన్లో ఏప్రిల్ 8వ తేదీన జరిగిన ఎస్పిబి 50 సంగీత విభావరికి మంచి స్పందన వచ్చింది.
స్వర్ణోత్సవ గాన విభావరిలో ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారు, ఆయన బృందం ఎన్నో అపురూపమైన పాటలు నాలుగైదు భాషల్లో పాడి నాలుగు గంటల సేపు శ్రోతలని ముగ్దులను చేశారు. పూర్తి ఆర్కెస్ట్రాతో సుప్రసిద్ద గాయనీ చిత్ర, ఎస్.పి శైలజ తదితరులూ కూడా తమ గానాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమ రూపశిల్పి నిర్బహణ ఎస్.పి.బి. తనయుడు, ప్రసిద్ధ గాయకుడు ఎస్.పి చరణ్ గారే, చరణ్ చతురోక్తులతో మొత్తం కార్యక్రమం భలే ఆసక్తికరంగా జరిగింది. వెనుక తెర మీద బాలూ గారి సినీ జీవిత ప్రస్థానంలో కొన్ని ఘట్టాలు గాన విభావరికి చిత్ర మాలికలని అందించి కనుల పండుగ చేశాయి.













