వాళ్లు మనుషులు కాదు…జంతువులు
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు మనుషులు కాదని, వారు జంతువుల్లాంటివారని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా వలస చట్టాలు మూగబోవడం వారికి కలిసివస్తున్నదని పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో కాలిఫోర్నియా, మెక్సికో ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. అమెరికాలో ఆ క్రమంగా నివసిస్తున్న కొందరిని మనం దేశం నుంచి బలవంతంగా బయటకు పంపాల్సి వస్తున్నది. గతంలో ఎన్నడూ లేనంత ఉద్ధృతంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇలా అక్రమంగా నివసించేవాళ్లు మనుషులు కాదు..జంతువులు అంటూ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. వలస చట్టాలు బలహీనంగా ఉండటం వల్లే వారంతా దేశంలోకి అక్రమంగా ప్రవేశించారన్నారు. అలాంటి వారిని అరెస్ట్ చేస్తున్నా పెద్దగా మార్పు రావడం లేదన్నారు. వైట్‌హౌస్ నివేదిక ప్రకారం రోజుకు వెయ్యిమంది, ఏడాదికి మూడు లక్షలకుపైగా అక్రమంగా అమెరికాలోకి వలస వస్తున్నారు.













