మేరిల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు
మేరిల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మేరిల్యాండ్ టీడీపీ అధ్యక్షులు రాజా రావులపల్లి అధ్యక్షత వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ హేమప్రసాద్ యడ్ల, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
డాక్టర్ హేమప్రసాద్ యడ్ల మాట్లాడుతూ… చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం, రాజధాని అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా ప్రతి ప్రవాసాంధ్రుడు పనిచేయాలి. అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఏనాటికైనా తెలుగువారు అమెరికా అధ్యక్షులు కావాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారన్నారు. ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు డాక్టర్ హేమప్రసాద్ యడ్ల తెలిపారు.













