వీసాల కష్టాలు…బ్రిటన్ కూడా
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టడమే ఆలస్యం వీసాలపై కఠిన నిబంధనలు విధించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ జాబితాలోమొన్న మలేషియా – ఆ తర్వాత సింగపూర్ చేరాయి. తాజాగా బ్రిటన్ సైతం ఈ జాబితాలో చేరింది. కీలక రంగాలైన ఐటీ – హెల్త్ – ఎడ్యుకేషన్ తదితరరంగాల ప్రొఫెషనల్స్ కు వీసాలు జారీ చేసే విషయంలో బ్రిటన్ సరికొత్త ప్రతిబంధకాలను విధించనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.ఇంటర్ కంపెనీ ట్రాన్స్ ఫర్ (ఐసీటీ)పై బ్రిటన్ లో పనిచేసేందుకు వచ్చే ప్రొఫెషనల్స్ టైర్ 2 డిపెండెంట్ వీసాలపై కూడా ఇదే తరహాలో బాదుడుఉండబోతోంది. దీంతోపాటుగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేషన్ లోనూ మరికొన్ని నిబంధనలు చేర్చారు. ఏప్రిల్ 6(గురువారం) నుంచే ఈ నూతననిబంధనలు అమలులోకి వస్తాయని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఇమిగ్రేషన్ స్కిల్ చార్జీలు హెల్త్ సర్ చార్జీల భారాన్ని ఆయా సంస్థలేభరించాలని నిబంధనల్లో పేర్కొనడంతో పరిశ్రమ వర్గాల్లో ఆందోళన నెలకొంది. తన దేశ పరిస్థితుల కారణంగా వీసాల విషయంలో బ్రిటన్ తీసుకున్నఈ నిర్ణయం భారత్ సహా యురోపియన్ యూనియన్ లో సభ్యులు కానీ దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.













