న్యూయార్క్ లో కన్నుల పండుగగా నైటా భోగి పళ్ళు సందడి
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్బంగా ది హిందు టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ అఫ్ న్యూయార్క్(సెల్డెన్ టెంపుల్) లో భోగి పళ్ళు కార్యక్రమం వందలాధి భక్తుల మధ్య చిన్నారులతో సాంప్రదాయముగా భక్తోత్సరణముగా ఘనముగా జరుపుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా నైటా ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నైటా ప్రతిసంత్సరం సరికొత్త కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఈ భోగి పళ్ళు కార్యక్రమానికి వచ్చిన చిన్నారులు మరి వారి తల్లితండ్రులు అందరికి నైటా తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తూ నైటా వారు అందించిన భోగి పళ్ళుతో పిల్లలను ఆశీర్వదించవలిసిందిగా కోరడం జరిగింది.
ఈ సందర్బంగా టెంపుల్ లో గోధాదేవి కళ్యాణం కమనీయంగా సాగింది. పూజారి వేదవ్యాస్ మరియు టెంపుల్ నిర్వాహకులు శ్రీనివాస్ గారు, లావణ్య గారు, పుష్ప గారు భోగి పళ్ళు కార్యక్రమనికి చక్కటి సహాయ సహకారాలు అందిచడం జరిగింది.
ఆధ్యంతం ఉత్సాహభరితంగా అనందంగా చినారుల చే భోగి పళ్ళు నరదిష్టి కార్యకమనికి వచ్చినవారు చాలా సంతోశాన్ని వ్యక్తపరచడం జరిగింది. అమెరికాలో ఇలాంటి కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషాన్ని, తెలియజేస్తూ నైటా కార్యవర్గనికి కృతజ్ఞతలు వ్యక్త పరచడం జరిగింది.
ఈ సందర్బంగా నై టా కార్యవర్గం వైస్ ప్రెసిడెంట్ పద్మ తాదూరి, సెక్రటరీ రవీందర్ కోడెల, జాయింట్ సెక్రెటరీ సౌమ్య శ్రీ, జాయింట్ ట్రెసరర్ నరోత్తం మరియు మెంబెర్ హారిక జంగమ్. బోర్డు అఫ్ డైరెక్టర్స్ కృష్ణ భాదే గారు, సహోధర్ గారు, పవన్ గారు, మల్లిక్ గారు హాజరు జరగడం జరిగింది.
భక్తి శ్రద్దలతో జరిగిన ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ప్రెసిడెంట్ వాణి గారు చాలా సంతోషాన్ని అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి, నైటా టీంకి, టెంపుల్ వారికీ మరియు చిన్నారుల తల్లితండ్రులకి కృతజ్ఞతలు తెలియచేస్తూ నైటా జరిపే తదుపరి రిపబ్లిక్ డే అండ్ మహాశివరాత్రి కార్యక్రమాలకు అందరిని ఆహ్వానిచడం జరిగింది. పిదప చక్కటి ప్రసాదం పంపిణితో కార్యకక్రమం ముగిసింది.







