డల్లాస్‌లో మంచు లక్ష్మిని సత్కరించిన నాటా, టాంటెక్స్
డల్లాస్‌లో సినీనటి మంచులక్ష్మీని ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా), నార్త్ టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఘనంగా సత్కరించింది. అమెరికాలో పర్యటిస్తున్న మంచులక్ష్మీతో డల్లాస్‌లో ఛాట్ షో జరిగింది. ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ, మేము సైతం కార్యక్రమం ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. సమాజంలో ఎన్నిఆటంకాలుఎదురైనా వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోవాలని పిలుపునిచ్చారు. మంచు లక్ష్మి చేస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాల నేపథ్యంలో ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం వారు ఆమెని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మందికిపైగా తెలుగు వారుహాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాటా ఎలెక్టివ్ ప్రెసిడెంట్ కొర్సాపాటి శ్రీధర్‌రెడ్డి, కార్యవర్గ, పాలకమండలి సభ్యులకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు.













