అలరించిన మౌంటీన్హౌస్ ట్రేసీ ఉగాది వేడుకలు
తెలుగు వారి తొలి పండుగ ఉగాది సంబరాలు ఉత్తర కాలిఫోర్నియాలో మౌంటిన్ హౌస్ ట్రేసీ తెలుగు సంఘం (ఎంటీటీఎ) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మౌంటీన్ హౌస్ బెతనీ మల్లీపర్సస్ రూంలో జరిగిన వేడుకల్లో మౌంటీన్ హౌస్, ట్రేసీలోని తెలుగువారు సంప్రదాయ దస్తులు ధరించి ఆట, పాటలతో అందరిని అలరించారు. ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి, ఇండో అమెరికన్ కమ్యూనిటీ స్టేట్ ఆఫ్ సీఎ, గవర్నర్స్ ఆఫీసు కల్చరల్ అంబాసిడర్ మన్నా ప్రగడ శ్రీనివాస్, తెలంగాణ అమెరికన్ ఆఫీసు కల్చరల్ అంబాసిడర్ మన్నాప్రగడ శ్రీనివాస్, తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ రమేష్ తనిగెళపల్లి, ఎంహెచ్సీఎస్డి బోర్డు వైస్ ప్రెసిడెంట్ బైర్నైస్ ట్రింగిల్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం శ్రీ సీతారామస్వామి కళ్యానం నిర్వహించారు. ఉగాదిపచ్చడి కళ్యాణ పానకం ఇచ్చి అనంతరం నోరూరించే విందు భోజనం వడ్డించారు. శివపార్వతి అనంతు, స్వప్ప ఆదే వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. డాక్టర్ లక్కిరెడ్డి ప్రసంగం ఆకట్టుకుంది. ఎంటీటీఎ కార్యనిర్వాహక సంఘం వారు అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు.













