శేషు శర్మ, శ్యామ్సుందర్ ఎల్లంరాజుకు మైత్రీ అవార్డు
అట్లాంటాలో అమెరికా వచ్చిన తల్లితండ్రులు, సీనియర్లకోసం 2008లో ప్రారంభమైన మైత్రీ సంస్థ ఎన్నో కార్యక్రమాల నిర్వహణ ద్వారా మంచి గుర్తింపును అందుకుంది. ప్రతి సంవత్సరం డా, పి. వేణుగోపాలరావు – మైత్రీ అవార్డులను కమ్యూనిటీకోసం సేవ చేస్తున్నవారిని గుర్తించి అందజేస్తున్నది. ఈ సంవత్సరం హెచ్టిఎ ట్రస్టీ, తామా మాజీ సెక్రటరీ, ఆర్టిస్ట్, కమ్యూనిటీ వలంటరీ డా. శేషు శర్మకు, తామా మాజీ అధ్యక్షుడు, హెచ్టిఎ ట్రస్టీ, థియేటర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ శ్యాంసుందర్ ఎల్లంరాజుకు మైత్రీ అవార్డును అందజేయనున్నది. ఏప్రిల్ 15వ తేదీన లాంబర్ట్ హైస్కూల్లో జరిగే తామా ఉగాది వేడుకల్లో ఈ అవార్డును వారికి అందజేయనున్నట్లు వినోజ్ చనుమోలు తెలిపారు.













