పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన టిఆర్ఎస్ ఎన్నారై శాఖలు
-కేటీఆర్ గారి సమక్షంలో సభ్యత్వం తీసుకొని కాంపెయిన్ మొదలు పెట్టిన మహేష్ బిగాల
-సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలన్న కేటీఆర్
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు నలభై దేశాలలోని టిఆర్ఎస్ ఎన్నారై శాఖలు పార్టీ సభ్యత్వ నమోదు కాంపెయిన్ ఈరోజు నుండి మొదలు పెట్టాయి. టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల కేటీఆర్ గారి చేతుల మీదుగా సభ్యత్వం తీసుకున్నారు. మహేష్ మాట్లాడుతూ ౩౩ జిల్లాలో పార్టీ కార్యాలయాలను స్థాపిస్తునందుకు ఎన్నారైలందురు హర్షం ప్రకటించారని తెలిపారు.పార్టీ రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో 40 దేశాలలోని ఎన్నారై శాఖలు తమవంతు సహాయాన్ని చేశాయన్నారు. ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ గారు కోటి మంది పైగా సభ్యత్వ నమోదు కు పిలుపు మేరకు ఎన్నారై శాఖలు కూడా తమ వంతు కార్యాచరణ మొదలు పెట్టాయన్నారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ఎన్నారై సలహాదారు మాజీ ఎంపీ కవిత గారి ఆధ్వర్యంలో వందవరకు టిఆర్ఎస్ ఎన్నారై శాఖలను విస్తరిస్తామన్నారు.













