అమెరికాలో పంజాబ్ యువకుడి కాల్చివేత
అమెరికాలో విక్రమ్ జర్యాల్ అనే 26 సంవత్సరాల పంజాబ్ యువకుడిని యకిమా సిటీలో కాల్చి చంపారు. ఆయన పనిచేస్తున్నఏఎం-పిఎం గ్యాస్ స్టేషన్‌కు తుపాకులతో వచ్చిన దుండగులు డబ్బు డిమాండ్ చేశారు. కౌంటర్లో ఉన్న నగదు ఇచ్చాక కూడా విక్రమ్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. విక్రమ్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా చనిపోయాడు. విచారణ కొనసాగుతోంది. విక్రమ్‌పై కాల్పులు జాత్యాహంకార దాడేనని భారతీయులు ఆరోపిస్తున్నారు. తన సోదరుడి దారుణ హత్య విషయాన్ని ఆయన సోదరుడు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి ట్విటర్ ద్వారా తీసుకొచ్చారు. మృతదేహాన్ని పంజాబ్‌లోని తమ స్వస్థలం హోషియార్‌పూర్‌కు తీసుకురావడంలో సహకరించాలని కోరారు. విక్రమ్ హత్యను సుష్మ స్వరాజ్ ఖండించారు.













