విద్వేష దాడులు ఆపండి ….. రాజా కృష్ణమూర్తి
అమెరికాలోని భారతీయులు, అల్ప సంఖ్యాక వర్గాలపై విద్వేష దాడులను అడ్డుకునేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ట్రంప్ సర్కారును భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కోరారు. ఈ దాడులు పెరగడానికి చాలా కారణాలున్నాయి. ఉన్నత పదవుల్లోని నాయకులు చేసే విద్వేష వ్యాఖ్యలు కూడా వాటిలో ఒకటి. ఇటీవల కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కువవుతున్నాయి అని ఆయన తెలిపారు. వలసల విధానంలో శ్వేతసౌధం తీసుకుంటున్న భిన్న నిర్ణయాలు భారతీయ అమెరికన్లు సహా లాటిన్ అమెరికా దేశాల ప్రజలు, ముస్లింలలో గందరగోళం, ఆందోళన, భయాలను రేకిత్తిస్తున్నాయి. ఇవి దేశంలో విద్వేష వాతావరణాన్ని పెంచుతున్నాయి అని మీడియా సమావేశంలో ఆయన వివరించారు. ఈ తరహా పరస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కనబడట్లేదని పేర్కొన్నారు. ఇక చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైందన్నారు.













