చైనాకు వ్యతిరేకంగా షికాగోలో నిరసనలు
గల్వాన్ లోయలోని భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడి హింసాత్మక ఘటనలకు పాల్పడిన చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని షికాగోలోని ఉన్న చైనా రాయబార కార్యాలయం ఎదుట పలువురు భారతీయ అమెరికన్లు డ్రాగన్ దేశానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. పొరుగున ఉన్న దేశాల్లో చైనా దురాక్రమణలకు పాల్పడుతోందని, ప్లకార్డులను ప్రదర్శిస్తూ చైనాకు వ్యతిరేక నినాదాలు చేశారు. భారత భూభాగంలోని లద్దాఖ్, లేహ్ ప్రాంతాల్లో చైనా చొరబాటుకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నాం. ఆ దేశం చర్యలపట్ల భారతీయ అమెరికన్లు మౌనంగా ఉండరని ఈ సందర్భంగా చైనాకు సృష్టం చేయదల్చుకున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రపంచ మొత్తం భారత్కు మద్దతుగా ఉంది అని షికాగోకు చెందని భారతీయ అమెరికన్ డాక్టర్ భారత్ బరాయ్ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు గుమిగూడటంపై షికాగోలో ఆంక్షలు ఉన్న నేపథ్యంలో అతి తక్కువ మందితో ఈ నిరసన చేపడుతున్నట్లు బరాయ్ పేర్కొన్నారు.













