మిలియన్ డాలర్ల నిధితో ఇండియన్-అమెరికన్ ఎన్‌జిఒ సహాయ కార్యక్రమాలు
కరోనా బాధితులకు సహాయ చర్యలు చేపట్టేందుకు ఇండియన్- అమెరికన్ లాభాపేక్ష రహిత సంస్థ (ఎన్‌జిఒ) ఒక మిలియన్ డాలర్ల నిధిని సమకూర్చింది. ఇండియాస్పోర తరువాత ఈ మేరకు నిధిని సమకూర్చిన రెండో సేవా సంస్థ ఇంటర్నేషనల్, ఈ సంస్థ అమెరికాలో 6,25,000 మాస్క్‌లు, 63,000 భోజనాలు, ఫుడ్ కిట్లు, 1,00,000 ఫుడ్ పాంట్రీలు సరఫరా చేయగలిగినట్టు సేవా ఇంటర్నేషనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరుణ్ కంకానీ చెప్పారు. ఈ సేవా కార్యక్రమంలో దాదాపు 200 మంది డాక్టర్లు, అటార్నీలు, ఆర్థిక, ఉద్యోగ నిపుణులను చేర్చి వారి మార్గ దర్శకాలను అందచేసింది. దాదాపు 3000 మంది వాలంటీర్ల ద్వారా 198 నగరాల్లో సహాయ కార్యక్రమాలను చేపట్టింది. వెయ్యిమంది వాలంటీర్లు మాస్క్‌ల తయారీలో పాలుపంచుకున్నారు. మెట్రోపాలిటన్ ఏరియాల్లో 10 హెల్ప్లైన్లను ప్రారంభించింది. కొంతమంది దాదాతు 50 వేల డాలర్ల వంతున ఈ సేవా సంస్థ విరాళం అందించారు.













