సుప్రీంకోర్టు న్యాయమూర్తి రేసులో ప్రవాస భారతీయుడు
అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవి రేసులో ప్రవాస భారతీయుడు రికన్ అమూల్ థాపర్ కూడా ఉన్నారు. ఇందుకోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వడపోసిన 25 మందిలో ఆయన పేరు కూడా ఉంది. ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ ఆంటోనీ కెన్నెడీ(81) స్థానంలో తాజా ఎంపిక అవసరమైంది. జులై 31న తాను పదవీ విరమణ పొందనున్నట్లు జస్టిస్ కెన్నెడీ ప్రకటించారు. 25 మందితో హెరిటేజ్ ఫౌండేషన్ అండ్ ఫెడరలిస్టు సొసైటీ రూపొందించిన జాబితా నుంచే తుది ఎంపిక జరుగుతుందని ట్రంప్ తెలిపారు. కెంటకీకి చెందిన థాపర్ (49) కూడా ఈ జాబితాలో ఉన్నట్లు అమెరికా పత్రికలు పేర్కొన్నాయి. అంతిమంగా ఏడుగురు జడ్జీల పేర్లు ట్రంప్ పరిశీలనలో ఉంటాయని, వాటిలో థాపర్ కూడా ఒకరని ద వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పేర్కొంది.













