హ్యూస్టన్ లో ఘనంగా ఉగాది వేడుకలు
హ్యూస్టన్‌లో హేవిళంబినామ సంవత్సర ఉగాది వేడుకలను హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీన ఘనంగా నిర్వహించారు. పియర్లాండ్లోని శ్రీ మీనాక్షి దేవాలయ కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకలకు తెలుగువాళ్ళు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
అధ్యక్షుడు బ్రహ్మానంద రెడ్డి బేరివీర (బ్రహ్మ), కార్యదర్శి రాము ఉప్పలపాటి, ట్రెజరర్ కిరణ్ మద్దినేని, కల్చరల్ సెక్రటరీ జానకి పేరి, శ్రీనివాస్ మంతెన, వెబ్ కమ్యూనికేషన్స్‌ను చూసే మనోజ్ పాలడుగు, లిటరరీ కో ఆర్డినేటర్ ఇందిరా చెరువు, ట్రస్టీలు శాంత సుసర్ల, రవి తమిరెస, మారుతి రెడ్డి చింతపర్తి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా వచ్చిన అలోక్ మాడసానిని ఘనంగా సన్మానించారు. అర్జున్ ఘట్టమనేని, బద్రుద్దిన్ పిట్టర్, పల్లవీ కుమార్, సురేంద్ర గంటా, డిప్యూటీ కాన్సులేట్ జనరల్ తదితరులను కూడా అవార్డులతో సత్కరించారు. తెలుగు ప్రముఖులు మల్లిక్ పుచ్చాను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. మిమిక్రీ రమేష్ తన మిమిక్రీతో అలరించారు. గాయకుడు సింహా పాడిన పాటలు ఉత్సాహాన్ని ఇచ్చాయి. గాయని శారద ఆకునూరి కూడా తన గానంతో అందరినీ పరవశింపజేశారు.













