డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ నూతన చీఫ్ గా ఉత్తమ్
డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో భారత సంతతికి చెందిన ఉత్తమ్ ధిల్లాన్‌కు కీలక పదవి దక్కింది. వైట్‌హౌస్ ఉన్నతస్థాయి న్యాయవాది అయిన ధిల్లాన్‌ను కీలక డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు. అమెరికాలో డ్రగ్స్ స్మగ్లింగ్, మత్తుపదార్థాల వాడకాన్ని నిరోధించటానికి ఈ ఏజెన్సీ పనిచేస్తుంది. రాబర్ట్ పాటర్సన్ పదవీ విరమణతో ఆయన స్థానంలో ధిల్లాన్‌ను ప్రభుత్వం నియమించింది. ఇంతకుముందు వైట్‌హౌస్‌లో ట్రంప్‌కు డిప్యూటీ కౌన్సిల్, డిప్యూటీ అసిస్టెంట్‌గా ఆయన సేవలందించారు.













