ధిరుక్ ఆల్బమ్ విడుదల
డల్లాస్‌లో ధిరుక్ ధిరుక్ తిల్లాన మ్యూజిక్ ఆల్బమ్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ అమెరికన్ ప్రెండ్ షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిధిగా హాజరయ్యారు. భారతీయ సంగీతాన్ని ఎంతగానో అభిమానించే రాజశేఖర్ సూరిభొట్ల్ల ఈ ఆల్బమ్ కు మ్యూజిక్ కమ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ ఆల్బమ్ కు లక్ష్మీనాగ్ సూరిబొట్ల, చంద్రబోస్, డా.వడ్డెపల్లి క్రిష్ట, శ్రీనివాస మౌళీలు పాటలు రాయగా, సంతోష్ కమ్మంకర్, రమ్మ బెహర, సుమంగళి, ప్రణవి ఆచార్య, సాయి శివాణిలు తమ గాత్రాన్ని అందించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పద్మా కమ్మంకర్ వ్యవహరించారు. ఈ ఆల్బమ్ రూపొందించడంలో నవీన్, రాజ్‌శేఖర్, రాజా కళ్యాణ్, కిరణ్, సిరిల్ లు వివిధ విభాగాల్లో పని చేశారు.
ఈ సందర్భంగా ఆల్బమ్ ను ఆవిష్కరించిన ప్రసాద్ తోటకూర సంగీత అభిమానుల కోసం రాజశేఖర్ సూరిభోట్ల చేస్తున్న కృషిని కొనియాడారు. అంతేకాకుండా లోకల్ టాలెంట్‌ను గుర్తించి వారికి అవకాశాలు ఇస్తున్నందుకు సూరి బోట్లను అభినందించారు. అనంతరం సూరిబోట్ల మాట్లాడుతూ ఈ ఆల్బమ్ ను తయారు చేయడానికి సహకరించివారందరికి కృతజ్ఞతలు తెలిపారు. డా.నరసింహారెడ్డి ఉరిమిడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, శారద సింగిరెడ్డి, శ్రీనివాస్ ప్రబల, నాగలక్ష్మీ సంతానగోపాలన్, లక్ష్మీ నాగ్ సూరిబోట్లలు ఆల్బమ్ లోని ఒక్కో పాటను విడుదల చేశారు. కాగా, ఆర్పీ పట్నాయక్ , సురేష్ మాధవరెడ్డి, చంద్రబోస్, వడ్డెపల్లి క్రిష్ట, శ్రీనివాస్ మౌళి, శ్రీ కృష్ణలు వీడియో ద్వారా ధిరుక్ ధిరుక్ తిల్లాన టీంకు శుభాకాంక్షలు తెలిపారు.













