ATA: ఆటా ఆధ్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవాలు

అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) సాహిత్య విభాగం ఆధ్వర్యంలో దాశరథి శతజయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. సెప్టెంబరు 28వ తేదీన సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రముఖ కవులు, రచయితల ప్రసంగాలు జరగనున్నాయి. న్యూజెర్సీలోని నెంబర్ 1 ఐవీ టెర్రస్ వేదికగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ, న్యూయార్క్ ప్రాంత సాహిత్యాభిమానులు దాశరథి గురించి కానీ, సామాజిక స్పృహ ఉన్న అంశంపై కానీ కవిత చదివి వినిపించవచ్చని ఆటా తెలిపింది. లేదంటే దాశరథి గురించి కొత్త విషయాలతో వ్యాసం కూడా చదివి వినిపించవచ్చని తెలిపారు. ఒక్కొక్కరికీ 2-3 నిమిషాల సమయం మాత్రమే ఉంటుందని చెప్పిన ఆటా (ATA).. మంచి వ్యాసం, కవిత వినిపించిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తామని తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకునే వారు సెప్టెంబరు 25 తేదీలోపు https://evite.me/bVFx6wvJSu లింకులో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.