ఓసీఐ కార్డు లోపాలు సరిదిద్దాలి : ఎన్ఆర్ఐ
ఓసీఐ కార్డు లోపాలు సరిదిద్దాలని అమెరికాలోని ప్రముఖ ప్రవాసుడు ప్రేమ్ భండారి భారత ప్రభుత్వానికి సూచించారు. ఆ లోపాల వల్లే అమెరికా నుంచి భారత్కు ప్రయాణించే సమయంలో విమానాశ్రయాల్లో అనేకమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. ఓసీఐ కార్డును బహుళ ప్రయోజన జీవితకాల వీసా గా పరిగణించరాదన్నారు. నిబంధనల ప్రకారం వయసు 20 ఏళ్ల లోపు, లేదా 50 ఏళ్ల దాటినవారికి ఓసీఐ కార్డు జీవితకాల వీసాగా పనిచేస్తుంది. అయితే పాస్పోర్టు రెన్యువల్ చేసిన ప్రతిసారీ ఓసీఐ కార్డునూ రెన్యువల్ చేయాలి. ఇలా ఎందుకు చేయాలని కొందరు ప్రశ్నిస్తున్నారని, ఈ కన్ఫ్యూజన్ను ప్రభుత్వం తొలగించాలని ప్రేమ్ భండారి కోరారు.













