హాలీవుడ్ గాయని బియాన్స్ భారీ సాయం
హాలీవుడ్ పాప్ గాయని బియాన్స్ 6 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.45 కోట్ల 80 లక్షలు) విరాళం ఇచ్చారు. బియాగూడ్ ఫౌండేషన్ ద్వారా అందించనున్నట్టు తెలిపారు. ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సేయ్ రిలీఫ్ పండ్, నేషనల్ ఆలియన్స్ ఇన్ మెంటల్ హెల్త్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ఏంజెల్స్, లోకల్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్కు ఈ డబ్బులను బదిలీ చేసినట్టు ఆమె తెలిపారు. ఈ ఆర్గనైజేషన్స్ యునైటెడ్ మెడికల్ సెంటర్, బ్రెడ్ ఆఫ్ లైఫ్, మేథెవ్ వంటి 25 సంస్థలతో కలసి కరోనా బాధితులకు కావాల్సిన కనీస అవసరాలైన ఆహారం, తాగునీరు, క్లీనింగ్ సప్లయిస్, మందులు, మాస్కులు, వ్యక్తిగత హైజెనిక్ వస్తువులను అందజేస్తాయి. నిత్యావసరాలతో పాటు మానసిక ఇబ్బందులను తొలగించేందుకు కూడా సన్నాహాలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా బియాన్స్ సూచించారు.













