చికాగోలో ఆటా మహిళా దినోత్సవ వేడుకలు
చికాగోలో అమెరికా తెలుగు ఆసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయల్ ప్యాలెస్‑లో జరిగిన ఈ కార్యక్రమానికి ‘బీబోల్డ్ ఫర్ ఏ ఛేంజ్’ అనే థీమ్‌తో నిర్వహించారు. దాదాపు 250 మందికి పైగా మహిళలు ఈ వేడుకలకు హాజరయ్యారు. వేడుకలకు హాజరైన సునీతారెడ్డి, డా.మెహర్ మేడవరంలుస్వాగత ఉపన్యాసాలు ఇచ్చారు. బ్రేస్ట్ క్యాన్సర్‌పై ప్రముఖ డాక్టర్ శీలా కొండా మహిళలకు అవగాహన కల్పించారు. మహిళల్లో మానసిక సమస్యలపై ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ అలయన్స్, ఇండియానాకు చెందిన నిపుణురాలు మేరీ బెడెల్ మాట్లాడారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలపైచర్చ జరిగింది. అర్బన్ జస్టిస్‌కు చెందిన అటార్నీ స్వప్నా రెడ్డి ఇమిగ్రేషన్ సమస్యలపై విలువైన సమాచారాన్ని పంచుకున్నారు.కార్యక్రమానికి హాజరైన మహిళలకు క్విజ్, తెలుగుస్పీకింగ్ కాంపిటీషన్ తదితర పోటీలు నిర్వహించారు.













