భారతీయ రైతులకు ‘ఆటా’ భరోసా.. ‘కృషివాస్’తో చేతులు కలిపిన ప్రముఖ తెలుగు సంస్థ!
ATA: భారతీయ రైతులను ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేసేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ అగ్రి-టెక్ సంస్థ కృషివాస్ (Krishivaas) తో చేతులు కలిపి “రైతును సాధికారం చేద్దాం – జీవితాల్లో వెలుగులు నింపుదాం” అనే నినాదంతో సరికొత్త ప్రాజెక్టును ప్రకటించింది.
ఏఐ (AI) సాంకేతికతతో సాగు:
శాటిలైట్ డేటా , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, పొలాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అత్యాధునిక సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. దీనివల్ల రియల్ టైమ్ అలర్ట్స్ అందడమే కాకుండా, రసాయనాల వాడకం తగ్గి పంట దిగుబడి , నాణ్యత పెరుగుతుంది.
‘స్పాన్సర్ ఏ ఫార్మర్’ – సువర్ణావకాశం:
కేవలం ఏడాదికి ఎకరాకు $7.25 చెల్లించడం ద్వారా ఎవరైనా ఒక రైతును స్పాన్సర్ చేయవచ్చు. దీనివల్ల రైతులకు ఆర్థిక వెసులుబాటు కలగడమే కాకుండా, స్పాన్సర్లు ప్రపంచంలో ఎక్కడి నుండైనా వెబ్ ద్వారా ఆ పొలాలను పర్యవేక్షించవచ్చు.
బాల్టిమోర్ మహాసభల్లో విస్తరణ:
ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా నేతృత్వంలోని కమిటీ ఈ సేవా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది. జూలై 31 నుండి బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా మహాసభల వేదికగా ఈ ప్రాజెక్టును మరింత విస్తృతం చేయనున్నారు. ఆసక్తి గల వారు +91 98493 17310 లేదా support@krishivaas.in ద్వారా సంప్రదించాలని ఆటా బృందం విజ్ఞప్తి చేస్తోంది.








