ఆటా ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026.. నామినేషన్ల ఆహ్వానం
ATA:అమెరికా తెలుగు సంఘం (ATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 19వ ఆటా కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారిని గౌరవించేందుకు ‘ATA Awards of Excellence 2026’ కోసం నామినేషన్లను ఆహ్వానిస్తోంది.
అవార్డు విభాగాలు..
క్రీడలు, బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్/లీడర్షిప్, కమ్యూనిటీ & హ్యుమానిటేరియన్ సర్వీస్, యూత్ యాక్టివిటీస్, సైన్స్ & టెక్నాలజీ, తెలుగు సాహిత్యం & విద్య, మెడిసిన్, , పెర్ఫార్మింగ్ ఆర్ట్స్.
- వేదిక: బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ (Baltimore Convention Center).
- ముఖ్య తేదీలు: కాన్ఫరెన్స్ జూలై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు జరుగుతుంది.
- దరఖాస్తు గడువు: నామినేషన్లు సమర్పించడానికి చివరి తేదీ జూలై 1, 2026.
ఆసక్తి గలవారు ఆటా అధికారిక వెబ్సైట్ సందర్శించి, సంబంధిత కేటగిరీని ఎంచుకుని, అప్లికేషన్ ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయవచ్చు. మీలోని ప్రతిభను లేదా సమాజం కోసం విశేష కృషి చేసిన వారిని గుర్తించి ఈ అవార్డులకు నామినేట్ చేయాలని అటా కోరుతోంది.
కాన్ఫరెన్స్ కోర్ కమిటీ..
జయంత్ చల్లా (ప్రెసిడెంట్), శ్రీధర్ బనాలా (కన్వీనర్), రవి చల్లా (కోఆర్డినేటర్), శరత్ వేముల (నేషనల్ కోఆర్డినేటర్), సుధీర్ దామిడి (డైరెక్టర్), జీనత్ కుందర్ (కో-కోఆర్డినేటర్), అరవింద్ ముప్పిడి (కో-నేషనల్ కోఆర్డినేటర్), తిరుమల రెడ్డి మునుకుంట్ల (కాన్ఫరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్), మరియు కిరణ్ ఆలా (కో-డైరెక్టర్).
అవార్డ్స్ కమిటీ:
సంతోష్ రెడ్డి (చైర్), హను తిరుమల్ (కో-చైర్), కిరణ్ బైరి (మెంబర్), విల్లాస్ జంబుల (మెంబర్), శరత్ వేముల (మెంబర్). ఈ కమిటీకి రాజేశ్వర్ టెక్మల్ వినోద్ కోడూరు సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు.








