Albany Telugu Association: ఘనంగా ఆల్బనీ సంక్రాంతి వేడుకలు
ఆల్బనీ తెలుగు సంఘం(Albany Telugu Association) ఆధ్వర్యంలో సంక్రాంతి (Sankranti) వేడుకలను వైభవంగా జరిపారు. జనవరి 18వ తేదీన హిందూ కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ వేడుకలకు తెలుగువాళ్ళు కుటుంబసమేతంగా హాజరై విజయవంతం చేశారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను, గాలిపటం పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందించారు. సంఘం అధ్యక్షుడు సురేష్ శ్రీరంగం తొలుత అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి వేడుకలకు వచ్చిన అతిధులను ఆహ్వానించారు. ఆయనతోపాటు ఆల్బనీ టీమ్ ఈ వేడుకల విజయవంతానికి కృషి చేసింది.
సంక్రాంతి సంప్రదాయాన్ని కొనసాగించేలా కార్యక్రమాలు చేశారు. పిల్లలకు భోగిపళ్ళు పోశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. గాయకుడు సందీప్ కూరపాటి పాటలను పాడి అందరినీ మైమరపింపజేశాడు. సంఘం అధ్యక్షుడు సురేష్ శ్రీరంగంతోపాటు సెక్రటరీ ప్రదీప్ ముచెలి, ట్రజరర్ సురేష్ రేగొండ, కిషన్ ఆర్ జమ్ముల, అశ్వని కలగొట్ల, హరీష్ కె రావుల తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బోర్డ్ అడ్వయిజర్లు విప్లవ్ పులి, చిత్తారి పబ్బ, లక్ష్మీ మంజునబచ్చు, అరవిందర్ రెడ్డి గుట్ట, విశాల్ మంద, సుష్మ కుదరవల్లి తదితరులు ఈ వేడుకల విజయవంతానికి సహకారాన్ని అందించారు.







