ఎన్టీఆర్ చిత్రానికి అరుదైన గౌరవం
ఇప్పటివరకు ఇండస్ట్రీలో నవలల ఆధారంగా సినిమాలు తెరకెక్కడం చూశాం. కాని ఈ సారి వినూత్నంగా ఓ సినిమా కథ నవలా రూపంలోకి మారనుందని అంటున్నారు. మరి ఆ గౌరవం మన తెలుగు సినిమాకి దక్కడం విశేషం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం టెంపర్. వక్కతం వంశీ ఈ చిత్రానికి కథని అందించాడు. టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ దయ పాత్రలో కనిపించగా ఈ మూవీ జూనియర్ ఇమేజ్‌ని మరింత పెంచింది. లక్ పరంగా ఈ సినిమా ఎన్టీఆర్ కి చాలా కలిసొచ్చింది. టెంపర్ తర్వాత జూనియర్ చేసిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలు భారీ విజయం సాధించాయి. కట్ చేస్తే టెంపర్ సినిమా కథ త్వరలో ఆంగ్ల నవలా రూపంలో పాఠకుల ముందుకి రానుందట. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన హారీ పోట్టర్ సిరీస్ ను పబ్లిష్ చేసిన బ్లూమ్స్ బెర్రీ సంస్థ టెంపర్ సినిమా కథకి నవలా రూపం ఇచ్చేందుకు సిద్ధమైందట. వీలైనంత త్వరలోనే ఈ నావెల్ ను మన ముందుకు తీసుకు రానున్నారు.






