బాలీవుడ్ పై ఆసక్తి చూపని తెలుగు హీరోలు
కరోనా తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా ప్రభావం దేశవ్యాప్తంగా విస్తరించి, పాన్-ఇండియా మార్కెట్లో ఆధిపత్యం సాధించింది. భారీ బడ్జెట్, టెక్నికల్ విలువలు, కంటెంట్ పరంగా కొత్త ప్రమాణాలు సెట్ చేసిన టాలీవుడ్ సినిమాలు వరుస సక్సెస్‌లతో బాలీవుడ్‌ను కూడా ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా అక్కడి డైరెక్టర్లు, నిర్మాతలు ఇప్పుడు తెలుగు హీరోలు, టెక్నీషియన్లపై దృష్టి సారిస్తున్నారు. అయితే ఈ ఆసక్తికి అనుగుణంగా టాలీవుడ్ నటుల నుంచి స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి
గతంలో కొన్ని ప్రాజెక్టులపై డిస్కషన్స్ జరిగినప్పటికీ అవి అమలులోకి రాలేదు. రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్(Allu ARjun) లాంటి స్టార్లు బాలీవుడ్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపినప్పటికీ, ఫైనల్ దశకు చేరలేదు. ప్రభాస్(Prabhas) నటించిన ఆదిపురుష్(Adipurush) భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశ కలిగించగా, ఎన్టీఆర్ చేసిన వార్2(War2) కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు టాలీవుడ్ హీరోలను మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నాయి.
ఇక మరోవైపు బాలీవుడ్ స్టార్లు మాత్రం తెలుగు డైరెక్టర్లతో కలిసి పనిచేయాలనే ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. సల్మాన్ ఖాన్(Salman Khan), ఆమిర్ ఖాన్(Aamir Khan), రణ్వీర్ సింగ్(Ranveer Singh) వంటి నటులు టాలీవుడ్ డైరెక్టర్లతో చర్చలు జరుపుతుండగా, తమిళ నటులు సూర్య(Suriya), కార్తి(Karthi), ధనుష్(Dhanush) కూడా తెలుగు బ్యానర్లతో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పరిశ్రమల్లో తెలుగు సినిమా ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ, టాలీవుడ్ కేంద్రంగా మారుతున్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








