గోదారి గట్టు పైన పెయిడ్ ప్రీమియర్స్ వెనుక అసలు స్ట్రాటజీ ఇదే!
టాలీవుడ్లో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల్లో గోదారి గట్టు పైన(Godari Gattupaina) అనే మూవీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. యంగ్ హీరో సుమంత్ ప్రభాస్(Smanth Prabhas) ప్రధాన పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్గా నిధి ప్రదీప్ కనిపించనున్నారు. మే 8న రిలీజ్ కు సిద్ధమైన ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. రిలీజ్ కు ముందే మేకర్స్ చేసిన ప్రమోషన్స్ సినిమాకు ప్లస్‌గా మారాయి. ముఖ్యంగా సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం, టీజర్ మరియు ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ఇవి కూడా చదవండి
ఇక ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేలా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలీజ్‌కు ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కథపై పూర్తి నమ్మకం, ఎమోషన్స్ పై స్ట్రెంగ్త్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా సినిమా చూసిన ప్రేక్షకుల ద్వారా పాజిటివ్ మౌత్ టాక్ తీసుకురావాలనే స్ట్రాటజీతో టీమ్ ముందుకెళ్తోంది. ఈ విధానం ఇటీవల కొన్ని సినిమాలకు మంచి ఫలితాలు ఇవ్వడంతో గోదారి గట్టుపైన కూడా అదే దారిని అనుసరిస్తోంది.
ఇక ట్రైలర్లో హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన జగపతి బాబు(Jagapathi Babu) క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ప్రముఖ నటి లయ(Laya) కీలక పాత్రలో నటించడం సినిమాకు అడిషనల్ ఎట్రాక్షన్ గా మారింది. నేడు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమా హైప్ మరింత పెరగనుంది. గ్రామీణ నేపథ్యంతో పాటు భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.








