సుమంత్ ప్రభాస్, సుభాష్ చంద్ర, రెడ్ పప్పర్ ప్రొడక్షన్స్ ‘గోదారి గట్టుపైన’ ట్రైలర్ ఏప్రిల్ 27న రిలీజ్
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది.
నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే టీజర్, సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఈ రోజు మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ‘గోదారి గట్టుపైన’ ట్రైలర్ ఏప్రిల్ 27న లాంచ్ చేయనున్నారు.
ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ క్యూట్ రొమాంటిక్ వైబ్ తో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.
ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని సాయి సంతోష్, ప్రొడక్షన్ డిజైన్‌ను ప్రవాల్య, ఎడిటింగ్‌ను అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైన్‌ను నాగార్జున తల్లపల్లి నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రం మే 8న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.








