ఉయ్యాలవాడ లో మరో ఇద్దరు హీరోలు?
ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీలో కూడా సత్తా చాటిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను మరింత భారీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాను కూడా చిరు తనయుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. మెగాస్టార్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉయ్యలవాడ నరసింహారెడ్డి సినిమాను 151వ సినిమాగా తెరకెక్కించాలని నిర్ణయించారు. ఇప్పటికే కథా కథనాలు రెడీ అయిన ఈ ప్రాజెక్ట్ను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో ఇద్దరు సీనియర్ హీరోలు కనిపించనున్నారట. హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. అలాగే మరో సీనియర్ హీరో వెంకటేష్ ఓ క్యామియో రోల్లో కనపడనున్నాడట. నిజానికి ఖైదీ నంబర్ 150లోనే వెంకీతో స్పెషల్ రోల్ చేయాలని భావించిందట చిత్ర బృందం. అయితే అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మాత్రం తప్పకుండా చేస్తానని వెంకీ మాటిచ్చాడట. ఇప్పటికే ఈ దిశగా వెంకీ అంగీకారం తీసుకున్నాడట రామ్చరణ్.













