పెద్ది యూఎస్ బుకింగ్స్ ఎప్పట్నుంచి అంటే?
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న అత్యంత అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో పెద్ది(Peddi) ఒకటి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలను సృష్టించింది. బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్గా నటిస్తుండడం వల్ల ఉత్తర భారత మార్కెట్లో కూడా ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. కంటెంట్‌తో పాటు స్కేల్ పరంగా కూడా ఈ సినిమా ప్రత్యేకంగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న వేళ, మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తూ కీలక అప్డేట్స్ను విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన చిత్రబృందం, నార్త్ అమెరికా రిలీజ్‌కు సంబంధించి సాలిడ్ ప్లాన్‌తో ముందుకు వస్తోంది. అక్కడ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా(pratyangira) ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనుంది. తాజా సమాచారం ప్రకారం, జూన్ 3న అక్కడ ప్రీమియర్స్ ప్రదర్శించనుండగా, వాటికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మే 7 రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేయడం ద్వారా ఓపెనింగ్స్‌పై భారీ హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఏఆర్ రెహమాన్(AR Rahman) ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం మరో పెద్ద హైలైట్‌గా మారింది. ఆయన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ తీసుకురానుందని అంచనా. వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas) నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఓవర్సీస్ బుకింగ్స్ మరియు ప్రీమియర్స్ కలెక్షన్స్ ఈ సినిమాకు టోన్ సెట్ చేయనున్నాయి.








