సంక్రాంతికి పోటీ పడనున్న సీనియర్ హీరోలు
టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ అంటే ఎప్పటికీ భారీ పోటీకి, పెద్ద సినిమాల సందడికి ప్రతీక. కానీ 2027 సంక్రాంతి మాత్రం ప్రత్యేకంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో నలుగురు ప్రముఖ వెటరన్ స్టార్లు చిరంజీవి(chiranjeevi), నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna), అక్కినేని నాగార్జున(Akkineni nagarjuna), దగ్గుబాటి వెంకటేష్(Daggubati Venkatesh) తమ తమ సినిమాలతో ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నలుగురు స్టార్ హీరోలు ఒకే సీజన్లో పోటీ పడటం చాలా అరుదైన సంఘటనగా భావిస్తున్నాయి సినీ వర్గాలు. దీంతో ప్రేక్షకుల్లోనే కాకుండా ట్రేడ్ సర్కిల్స్‌లో కూడా భారీ ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి
మెగాస్టార్ చిరంజీవి మెగా158(Mega158) ప్రాజెక్ట్‌తో డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli)తో జతకట్టనున్నారు. మే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మాస్ ఎంటర్టైనర్ను సంక్రాంతి 2027కి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని(Gopichand malineni) దర్శకత్వంలో ఇప్పటికే ప్రారంభించారు. మొదట దసరాకు ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి బరిలోకి మారింది. అలాగే విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil ravipudi) తో ఐదోసారి కలసి హాస్యభరితమైన సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా జూలైలో సెట్స్ పైకి వెళ్లి సంక్రాంతి రిలీజ్‌ను టార్గెట్ గా పెట్టుకుంది.
ఇక కింగ్ నాగార్జున కూడా సంక్రాంతి రేస్‌లో గ్రాండ్ ప్లాన్‌తో దిగుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా(Soggade Chinni nayana) ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ(Kalyan Krishna)తో ఆయన కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నాగ చైతన్య(Naga chaitanya), అక్కినేని అఖిల్(Akkineni Akhil) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఒకే పండుగ సీజన్లో నలుగురు సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడటం వల్ల బాక్సాఫీస్ సమీకరణాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సంక్రాంతి 2027 టాలీవుడ్‌కు భారీ సర్ప్రైజ్ ప్యాకేజీగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.








