‘సర్వం సిద్ధం’ టీజర్ విడుదల
సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శ్రీమతి శ్రీలత బి.వెంకట్ నిర్మిస్తున్న చిత్రం సర్వం సిద్ధం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అతిమల్ల రాబిన్నాయుడు దర్శకత్వంలో వినోదాత్మకంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం లోగో, ఫస్ట్‌లుక్ టీజర్, పోస్టర్లను తాజాగా విడుదల చేశారు. సినీ దర్శకుడు విఎన్ ఆదిత్య, అమ్మ రాజశేఖర్ సినెటేరియా గ్రూప్ సిఇఒ వెంకట్ బులెమోని, ఎస్సిసి మార్కెటింగ్ హెడ్ శ్రీ వికాస్, డాక్టర్ రవికుమార్ జైన్, టెక్స్టైల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అమ్మనబోలు ప్రకాశ్, నితిన్, కె పరేఖ్, శివశంకర్, హీరో సాగర్ యూనిట్సభ్యులతో పాటు హీరోయిన్లు లావణ్య, పూజ, ఫరీనా, సర్వం శ్రీనివాస్, మందార్ తదితరులు పాల్గొన్నారు. విఎన్ ఆదిత్య, అమ్మ రాజశేఖర్‌లు టీజర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీజర్ చాలా బాగుందని, సినీ పరిశ్రమలోని నాటి రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నారు.













